- డాక్టర్ దయాల్‌సింగ్‌కు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు
- రామగుండం మెడికల్ కాలేజీలో పలువురి బదిలీలు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ హిమబిందు సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆమె రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ దయాల్‌సింగ్‌ను రామగుండం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇదే క్రమంలో రామగుండం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు, వైద్యాధికారులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ జి.నరేందర్‌ను కరీంనగర్ మెడికల్ కాలేజీకి, జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ ఎ.అశోక్‌ను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి, అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ జి.లక్ష్మీనర్సయ్యను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి బదిలీ చేశారు.
జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. ప్రియాంకను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి, పీడియాట్రిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.రాజేశ్‌ను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి బదిలీ చేశారు. అలాగే ఆర్థోపెడిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.రాజు, పీడియాట్రిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.శిరీష, ఓబీజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ లక్ష్మిలను మంచిర్యాల మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. మరోవైపు మంచిర్యాల మెడికల్ కాలేజీ ఫిజియాలజీ విభాగం ప్రొఫెసర్ జి. రేఖ, సీనియర్ అసిస్టెంట్ హరికలను రామగుండం మెడికల్ కాలేజీకి బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
