హైదరాబాద్, వెలుగు: భారత ప్రజారోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి శనివారం ‘ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ చాలెంజ్’ ను అధికారికంగా ప్రారంభించారు. ప్రముఖ నిపుణులు ప్రొఫెసర్ అడ్రియన్ కెన్నెడీ, డాక్టర్ నదీమ్‌తో కలిసి డాక్టర్ నందకిషోర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదని.. ఒబెసిటీపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, రాష్ట్ర ప్రజల జీవక్రియ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి చేపట్టిన ఒక శాస్త్రీయ లాభాపేక్షలేని ఉద్యమమని తెలిపారు.
బరువు తగ్గడం అనేది కేవలం విల్ పవర్‌పై ఆధారపడి ఉంటుందనే పాత ఆలోచనా ధోరణిని మార్చి, మెడికల్ ఎడ్యుకేషన్, స్థిరమైన జీవనశైలి మార్పుల ద్వారా సాధించవచ్చని చెప్పారు. కిమ్స్ లివ్‌లైఫ్ హాస్పిటల్స్‌లో ఒబెసిటీ, డయాబెటిస్ సర్జరీ విభాగానికి క్లినికల్ డైరెక్టర్, చీఫ్ సర్జన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ దుక్కిపాటి టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులకు ఒబెసిటే ప్రధాన కారణమని గుర్తించారు.
