వ్యాక్సిన్ వేస్కున్నోళ్లకు.. డెల్టా ప్లస్‌‌‌‌తో డేంజర్ లేదు

వ్యాక్సిన్ వేస్కున్నోళ్లకు.. డెల్టా ప్లస్‌‌‌‌తో డేంజర్ లేదు

న్యూఢిల్లీ: కరోనా టీకా తీసుకున్నోళ్లకు కొత్త వేరియంట్ డెల్టా ప్లస్​తో పెద్దగా ప్రమాదమేమీ ఉండదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్​టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా చెప్పారు. ఒక్క డోస్ లేదా రెండు డోసులు తీసుకున్నవాళ్లకు ఈ వేరియంట్ సోకినా మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే కన్పిస్తున్నాయని చెప్పారు. డెల్టా ప్లస్ ఇతర కరోనా వేరియంట్ల కన్నా ఎక్కువగా లంగ్స్ టిష్యూకు అతుక్కునే చాన్స్ ఉందని, అంతమాత్రాన ఇది వాటి కన్నా ఎక్కువ ప్రాణాంతకమని గానీ, ఎక్కువగా వ్యాపిస్తుందని గానీ ఇప్పుడే చెప్పలేమన్నారు. జూన్ 11న గుర్తించిన డెల్టా ప్లస్ ను కేంద్రం ఇటీవల ‘ఆందోళనకర వేరియంట్’గా ప్రకటించింది. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 51 డెల్టా ప్లస్ కేసులు రికార్డ్ అయ్యాయి. అయితే మరిన్ని కేసులు నమోదైతేనే ఈ వేరియంట్ తీవ్రతను అంచనా వేయొచ్చని అరోరా అన్నారు.