డాక్టర్ రెడ్డీస్ చేతికి ప్రోజినోవా

డాక్టర్ రెడ్డీస్ చేతికి ప్రోజినోవా

హైదరాబాద్​, వెలుగు: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హార్మోన్ రీప్లేస్‌‌‌‌మెంట్ థెరపీ  విభాగంలోకి అడుగుపెట్టింది.  దీనికోసం బేయర్ నుంచి ప్రోజినోవా, సైక్లో ప్రోజినోవా బ్రాండ్లను కొనుగోలు చేసింది. 

ఈ ఒప్పందం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణ  విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. జర్మనీకి చెందిన బేయర్ కంపెనీ నుంచి ఈ హక్కులను పొందినట్లు సంస్థ సీఈఓ ఎంవీ రమణ తెలిపారు. ఈ బ్రాండ్ల విలువ సుమారు రూ.60 వేల కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.