
హైదరాబాద్, వెలుగు: చైల్డ్ న్యూట్రిషన్ సెగ్మెంట్లో సెలిహెల్త్ కిడ్జ్ ఇమ్యునో గమ్మీస్ను ఇండియా మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ లాంచ్ చేసింది. వెల్మ్యూన్, ప్రిబయోటిక్స్, ఇతర ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ వంటివి గమ్మీస్లో ఉంటాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
ముఖ్యంగా వెల్మ్యూన్ అనేది చిన్న పిల్లలలో ఇమ్యూనిటీ పెంచుతుందని పేర్కొంది. పిల్లలలో పౌష్ఠికత పెరగడానికి ఈ గమ్మీస్ దోహదపడుతుందని వివరించింది.