సాహితీవేత్త డా. శ్రీరంగాచార్యకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం

సాహితీవేత్త డా. శ్రీరంగాచార్యకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం

బషీర్​బాగ్, వెలుగు: తెలుగు వర్సిటీ 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏటా అందించే విశిష్ట పురస్కారాన్ని ఈసారి సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన డా. శ్రీరంగాచార్యకు అందజేశారు. రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు డా. కె.వి. రమణాచారి ప్రధాన అతిథిగా హాజరై బహూకరించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా చెందుపట్లలో జన్మించిన శ్రీరంగాచార్య నిరంతర అధ్యయనం, విశేష రచనా సేవలతో సారస్వత రంగంలో ప్రత్యేకత సాధించారన్నారు. విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చాటు పద్యాలలో చమత్కారాన్ని ప్రతిబింబింపజేసి శ్రీరంగాచార్య పలువురిని మెప్పించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ కోట్లు హనుమంతరావు అధ్యక్షత వహించారు.