లోక్ భవన్గా రాజ్ భవన్.. పీఎంవో పేరు ‘సేవాతీర్థ్’గా మార్చిన కేంద్రం

లోక్ భవన్గా రాజ్ భవన్.. పీఎంవో పేరు ‘సేవాతీర్థ్’గా మార్చిన కేంద్రం

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలు, ఆఫీసుల భవనానికి ప్రస్తుతం ఉన్న ‘రాజ్ భవన్’ పేరును కేంద్ర ప్రభుత్వం ‘లోక్ భవన్’గా మార్చింది. ఇకపై అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ ఆఫీసుల భవనాలకు ఈ మేరకు పేరును మార్చాలని ఇటీవల కేంద్ర హోం శాఖ లేఖలు రాయగా.. గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాలు ‘లోక్ భవన్’గా పేరును మారుస్తూ ఇప్పటికే నోటిఫికేషన్​లు జారీ చేశాయి. 

తెలంగాణ ప్రభుత్వం కూడా మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్​చేసింది. కాగా, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) పేరును కూడా కేంద్ర ప్రభుత్వం ‘సేవాతీర్థ్​’గా మార్చింది. దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లోని పీఎంవో నుంచి ప్రైమ్ మినిస్టర్లు పని చేస్తున్నారు. ఇప్పుడు పీఎంవో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ సముదాయంలోని భవనంలోకి మారనున్న నేపథ్యంలో పీఎంవో పేరును కూడా మారుస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.