ఏఐతో పేషెంట్లకు సత్వర ట్రీట్ మెంట్ : వేమూరి ఎస్​ మూర్తి

ఏఐతో పేషెంట్లకు సత్వర ట్రీట్ మెంట్ : వేమూరి ఎస్​ మూర్తి
  •      ఇల్లినాయిస్ మెడికల్ కాలేజీ హెడ్ వేమూరి ఎస్ మూర్తి  
  •      గాంధీలో వర్క్​షాప్ లో ప్రజంటేషన్

పద్మారావునగర్​, వెలుగు :  ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​(ఏఐ)  టెక్నాలజీతో  పేషెంట్లకు ఆధునిక వైద్య సదుపాయాలను సత్వరమే అందించవచ్చని చికాగోలోని ఇల్లినాయిస్ కాలేజీ ఆఫ్ ​మెడిసిన్, ఎమర్జెన్సీ డిపార్ట్​మెంట్ఎండీ​  డాక్టర్ వేమూరి ఎస్​ మూర్తి పేర్కొన్నారు.  

సోమవారం గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ ​కాలేజీల సంయుక్తాధ్వర్యంలో గాంధీ అలూమ్ని ఆడిటోరియంలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ​బేస్​డ్​ క్లినికల్​ కేస్ ​డిస్కషన్​ వర్క్​షాప్​లో ఆయన ప్రొగ్రాం డైరెక్టర్​గా పాల్గొని ప్రజంటేషన్ చేశారు. స్క్రీన్​పై  పేషెంట్ ను చూపుతూ ఎమర్జెన్సీలో ఏఐ టెక్నాలజీతో ఆటోమెటిక్ గా డయాగ్నోసిస్ చేయవచ్చనేది వివరించారు. అనంతరం డాక్టర్లు గ్రూప్​ డిస్కషన్ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ అలూమ్ని అసోసియేషన్​ జీఆర్​ లింగమూర్తి, సెక్రటరీ డా. రత్నం, డా. మహేశ్వర్​ పర్వతరెడ్డి, గాంధీ అనస్థీషియా ప్రొఫెసర్​ డా.నాగార్జున చక్రవర్తి, గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల డాక్టర్లు పాల్గొన్నారు.