
హైదరాబాద్: పెళ్లి కోసం మతం మార్పిడి చేసిన యువకుడి మాటలు అన్నీ అబద్దాలే అని తెలిపింది ఓ ముస్లి యువతి. ఇటీవల వికారాబాద్ కి చెందిన (ఓ హిందూ) భాస్కర్ తాను ప్రేమించిన అమ్మాయి కోసం ముస్లి మతం స్వీకరించినట్లు తెలిపాడు. తమ పెళ్లి జరగాలంటే యువతి తల్లిదండ్రులు మతం మార్చాలని ఫోర్స్ చేశారని..అందుకే హిందూ మతం నుండి ముస్లిం మతం స్వీకరించినట్లు చెప్పగా..అప్పట్లో ఈ సంఘటన హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చింది ముస్లిం యువతి. భాస్కర్ ను మతం మార్చుకోమని తమ తల్లిదండ్రులు చెప్పలేదని.. అతడే పెళ్లి పేరుతో తనను వేధించేవాడని చెప్పింది.
అయితే తన తండ్రి తాగుబోతు కావడంతో.. రోజూ మద్యం తాగించి అతడి వైపు తిప్పుకున్నాడని..భాస్కర్ అంటే తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది యువతి. ఇదే విషయంపై మంగళవారం HRC జరిపిన విచారణ అనంతరం మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఫ్రస్తుతం స్టడీస్ పై ఫోకస్ పెట్టానని.. తనకు తన ఫ్యామిలీకి ఏం జరిగినా భాస్కరే బాధ్యుడని చెప్పింది. మతం అనేది మనసుకు సంబంధించిందని.. ప్రేమకు మతం, కులం అవసరంలేదని చెప్పుకొచ్చింది.
మహమ్మద్ అబ్దుల్ హునైన్ గా మారిన భాస్కర్
హిందు మతం నుండి ముస్లిం మతం స్వీకరించిన వికారాబాద్ కి చెందిన భాస్కర్..ఢిల్లీ వెళ్లి 8 నెలలు శిక్షణ పొందిన తరువాత మహమ్మద్ అబ్దుల్ హునైన్ గా మారిండు. మతం మారి వచ్చిన తర్వాత పెళ్లికి నిరాకరించారు అమ్మాయి తల్లిదండ్రులు. యువతి కుటుంబ సభ్యులు మోసం చేశారంటూ ఇటీవల HRCని ఆశ్రయించాడు భాస్కర్. తామిద్దరికీ పెళ్లి చేయాలని, ఇద్దరికీ రక్షణ కల్పించాలని యువకుడు కోరాడు. అమ్మాయిని వికారాబాద్ పోలీసులు మంగళవారం HRC ముందు హాజరు పరచగా పై విధంగా స్పందించింది.