ఇయ్యాల రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

ఇయ్యాల రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో ఉదయం 10:15 గంటలకు ఆమెతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ముర్ము 21 గన్ సెల్యూట్ స్వీకరించి, జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు హాజరవుతారు. కాగా, ద్రౌపది ముర్ము మొదట రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు వస్తారు. ప్రమాణస్వీకారం అనంతరం తిరిగి ఇద్దరూ కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడ ముర్ము గౌరవ వందనం స్వీకరిస్తారు.