నవీపేట్లో యూనిఫామ్స్ పంపిణీ

నవీపేట్లో యూనిఫామ్స్ పంపిణీ

నవీపేట్, వెలుగు: జిల్లా లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్​ ఇస్తామని డీఆర్డీఏ పీడీ సాయగౌడ్ అన్నారు. మండలం లోని నాగేపూర్ శివాతండా నవీపేట్ గర్ల్స్ స్కూల్ లో దుస్తులను పంపిణీ అనంతరం అయన మాట్లాడారు. జిల్లా లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో బట్టలను కుట్టించి, పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా సంఘాలకు ఆదాయం సమకూరుతుందన్నారు. స్కూల్స్ ప్రారంభం అయ్యే సరికి ప్రతి పిల్లవాడికి ఈ దుస్తులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మహిళ సమైక్య మండల అధ్యక్షురాలు ఉషారాణి, సీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.