ఏం పని చేయకుండానే డబ్బులు సంపాదిస్తుండు

ఏం పని చేయకుండానే డబ్బులు సంపాదిస్తుండు

ఏదైనా పని చేస్తేనే జీతం వస్తుంది. ఎక్కువ జీతం కావాలంటే ఎక్కువ టైం​ పనిచేయాలి. కానీ ఇతను మాత్రం ఏం పని చేయకుండానే డబ్బులు సంపాదిస్తుండు. పని చేయకుంటే పైసలు ఎలా వస్తయ్​ అని ఆశ్చర్యపోతున్నరా! అయితే ఇతని స్టోరీ చదవండి.

జపాన్​కి చెందిన ఇతని పేరు షోజీ మొరిమోటో. ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా, ఎక్కడికైనా జర్నీ చేయాలన్నా ఇతన్ని తోడుగా తీసుకెళ్లొచ్చు. అందుకు వెయ్యి యెన్​లు (దాదాపు 5,663 రూపాయలు) ఇవ్వాలి. ముక్కూమొఖం తెలియని వ్యక్తిని తోడుగా తీసుకెళ్తే అతనేం మాట్లాడతాడో? ఏంటో? అదో తలనొప్పి అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇతను వెంట ఉంటాడే తప్ప మాట్లాడడు. ఇంతకు ముందు ఒక పబ్లిషింగ్ కంపెనీలో పనిచేసేవాడు. అప్పుడు అక్కడివాళ్లు ‘సరిగ్గా పనిచేయవు’ అని తిట్టేవాళ్లట. అలాంటి వాడే ఇప్పుడు ఏమాత్రం శ్రమపడకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు. మొరిమోటోను సోషల్​మీడియా ద్వారా బుక్​ చేసుకుంటారు క్లయింట్స్​. దాదాపు నాలుగేండ్లుగా ఇదే పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు వేల మందికి ఇలా తోడుగా వెళ్లాడు.
‘‘నన్ను ఎవరైనా కిరాయికి తీసుకోవచ్చు.

నా జాబ్ ఏంటంటే... నా క్లయింట్స్​ వెళ్లిన చోటికల్లా వెళ్లడం. ఖాళీగా కూర్చోవడం అంతే. ఏమీ చేయకుండా ఉండి, కంపెనీ ఇస్తే చాలు అనుకుంటారు చాలా మంది” అని తన జాబ్ గురించి చెప్పాడు మొరిమోటో.