Health : నిద్ర లేవగానే.. పరగడుపున ఈ జ్యూస్ తాగితే వచ్చే లాభాలేంటో చూద్దాం..

Health : నిద్ర లేవగానే.. పరగడుపున ఈ జ్యూస్ తాగితే వచ్చే లాభాలేంటో చూద్దాం..

వింటర్ మెలన్ జ్యూస్.. బూడిద గుమ్మడికాయ రసం తాగితే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటోంది ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. ఈమె ఎవరంటారా? బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ నీనాగుప్తా కూతురు. "బరువు తగ్గడం మీద కాకుండా... ఆయుర్వేదంలో చెప్పినట్టు మన శరీరాన్ని ఆల్కలైన్ బాడీగా మార్చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. క్రానిక్ డిసీజ్ బారిన పడం" అంటూ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్న ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మసాబాస్వేర్స్ బై హ్యాష్ ట్యాగ్ ఇలాంటి హెల్త్ టిప్స్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తోందామె. 

ఉదయాన్నే వింటర్ మెలన్ జ్యూస్ డే స్టార్ట్ చేస్తా. ఆరోగ్యం విషయంలో నాకు నేను ఒక క్వశ్చన్ వేసుకుంటుంటా ఎప్పుడూ... బరువు తగ్గడం గురించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఆరోగ్యంగా ఉండడం గురించి ఎంత పర్సెంట్ ఆలోచిస్తాం? నిజానికి మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆల్కలైన్ బాడీ కావాలంటే ఏం చేయాలి? ఆయుర్వేదం ఫాలో అయితే... అది మనల్ని ఆల్కలైన్ సిస్టమ్ లోకి తీసుకెళ్తుంది.

ఒకసారి ఆ స్టేజ్కి బాడీ వచ్చాక హెల్త్ పరంగా అద్భుతాలు జరుగుతాయి. అందుకే నేను పరగడుపున బూడిద గుమ్మడి కాయ రసం తాగుతా. ఆయుర్వేదం ప్రకారం నా శరీరం పిత్త రకానికి చెందింది. అందుకని రోజును వింటర్ మెలన్ జ్యూస్ తో మొదలుపెట్టడం వల్ల నాకెన్నో లాభాలు కలుగుతున్నాయి. అవేంటంటే డైయూరెటిక్, సయాటికా పెయిన్ నుంచి రిలీఫ్, చిన్న, పెద్ద పేగులశుభ్రం, యాంటీ ఏజింగ్ వంటి వాటితో పాటు శరీరం చల్లబడుతుంది కూడా. ఇవేకాకుండా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ జ్యూస్ ను నేరుగా తాగొచ్చు. అలా తాగడం కష్టం అనుకుంటే చిటికెడు నల్ల బెల్లం లేదా ఉప్పు కలుపుకోవచ్చు" అంటూ తన హెల్దీ టిపన్ను షేర్ చేసుకుంది. 

ఆల్కలైన్ బాడీ అంటే... 

ఆల్కలైన్ బాడీ అంటే... శరీరంలో ఎసిడిటీని తగ్గించడం. అందుకు ఏం చేయాలంటే... దానికి తగిన ఫుడ్ తినాలి. ఇలా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. బరువుతగ్గుతారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. దంత, చిగుళ్ల సమస్యలు పోతాయి. ఉబ్బరం సమస్య ఉండదు.

బూడిదగుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు, క్రిములు బయటకు పోతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య కూడా ఉండదు. బూడిద గుమ్మడికాయ డైయూరెటిక్. అందుకని దీన్ని తినడం వల్ల యూరిను ఎక్కువసార్లు వెళ్తుంటారు. దాంతో కిడ్నీలు ఎక్కువ సోడియంను యూరిన్ ద్వారా బయటకు పంపించేందుకు ఈ ఫుడ్ సాయపడుతుంది అన్నమాట.