జ్యూస్‌‌ తాగి బరువు తగ్గొచ్చు

జ్యూస్‌‌ తాగి బరువు తగ్గొచ్చు
  • క్యారెట్‌‌ కంటిచూపుకు మంచిదని వినే ఉంటారు. అదొక్కటే కాదు క్యారెట్‌‌తో బరువు కూడా తగ్గొచ్చు. క్యారెట్‌‌లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్‌‌‌‌ ఉంటాయి.  ఉదయం ఒక గ్లాస్‌‌ క్యారెట్ జ్యూస్‌‌ తాగడం వల్ల టిఫిన్‌‌లో తినే ఫ్యాట్‌‌ను దూరం చేయొచ్చు. ఇది చెడు ఫ్యాట్‌‌ను తగ్గించి బరువు తగ్గడానికి సాయపడుతుంది.  
  • కీర దోసకాయను సలాడ్‌‌లా వాడుతుంటారు. సమ్మర్‌‌‌‌లో శరీర వేడిని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువ. క్యాలరీలు తక్కువ ఉంటాయి. దీంతో బరువు తగ్గొచ్చు. ఒక గ్లాస్ కీర దోసకాయ జ్యూస్‌‌లో కొంచెం నిమ్మరసం, రెండు పుదీన ఆకులు వేస్తే సమ్మర్‌‌‌‌ డ్రింక్‌‌ రెడీ.
  • క్యాబేజీ, బచ్చలి కూరల్లో యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్‌‌, ఫైబర్‌‌‌‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని జ్యూస్‌‌గా చేసి తాగితే బరువు తగ్గొచ్చు. దానిమ్మ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌‌, విటమిన్‌‌– ఎ, సి, ఇ ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. చక్కెర లేని దానిమ్మ జ్యూస్‌‌ను రోజూ తాగితే బరువు తగ్గొచ్చు.
  • బీట్‌‌రూట్‌‌లో శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ (మాంగనీస్‌‌, పొటా షియం, సోడియం, ఐరన్‌‌) ఉంటాయి. ఇందులో ఉన్న ఫైబర్‌‌‌‌తో బరువు తగ్గొచ్చు.