సింగరేణి కార్మికవాడల్లో తాగునీటి కష్టాలు

సింగరేణి కార్మికవాడల్లో తాగునీటి కష్టాలు

కోల్​బెల్ట్, వెలుగు :  మందమర్రి పట్టణం మొదటి జోన్​ భగత్​సింగ్​నగర్​ సింగరేణి క్వార్టర్ల ఏరియాలో తాగునీటి సప్లై సక్రమంగా లేకపోవడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వాటర్​ సప్లై జరుగడంలేదని సింగరేణి సివిల్​ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నాయి.

గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల లీడర్లు కూడా పట్టించుకోవడంలేదని,  వేసవి కాలం కావడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్త చేస్తున్నాయి.  సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.