ఖాళీ సమయాల్లో యూట్యూబ్ లో సలహాలిస్తోన్న ఆటో డ్రైవర్

ఖాళీ సమయాల్లో యూట్యూబ్ లో సలహాలిస్తోన్న ఆటో డ్రైవర్

ఓ ఎనిమిది గంటలు పని చేసి ఇంటికి వస్తేనే అలసిపోయామంటూ కూలబడిపోతాం. వేరే పని చేయాలంటే వెనకడుగేస్తాం. వ్యక్తిగత జీవితం, అభిరుచులు, అవసరాల మధ్య సమతుల్యతను సాధించడం కష్టం. అలాంటిది ఓ ఆటో డ్రైవర్​ పొద్దంతా డ్రైవింగ్​ చేసి మిగతా సమయంలో తన వ్యక్తిగత అభిరుచిని ప్రపంచం ముందుంచుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బెంగళూర్​కు చెందిన ఉబర్​ డ్రైవర్​ జనార్దన్​ ప్రత్యేకతే ఇది. జనార్దన్​ తన విధులు ముగించుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో పర్సనల్​ ఫైనాన్స్, ​తదితర అంశాలపై యూట్యూబ్​ వీడియోలు చేస్తున్నాడు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ స్టాక్​లో ఇన్వెస్ట్​ చేయాలి, ఏ స్టాక్​ మంచిది తదితర అంశాలపై ఆయన చేస్తున్న వీడియోలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వ్యక్తిగత అభిరుచి ఉంటే కష్టమైనా ఇష్టంతో ఏదైనా చేయవచ్చని జనార్ధన్ నిరూపిస్తున్నాడు. 

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆసక్తి...

జనార్దన్ బీకాం పూర్తి చేశాడు.  నిత్యం స్టాక్​ మార్కెట్ హెచ్చు తగ్గులపై ఆసక్తి చూపుతూ ఉంటాడు. ఇది వరకు ఆయన ప్రత్యక్షంగా ప్రజలకు సలహాలు ఇచ్చేవారు. కానీ దాన్నే వ్యక్తిగత అభిరుచిగా మార్చుకుని "గోల్డ్​ జనార్దన్​ ఇన్వెస్టర్​" అనే యూట్యూబ్​ ఛానల్​ క్రియేట్​ చేశాడు. అర్థశాస్ర్తంలో సంక్లిష్టతలను సులువుగా వివరించడం అతని మరో ప్రత్యేకత. ప్రస్తుతం అతని ఛానల్​కి 3500 మంది సబ్ స్ర్కైబర్లు ఉండగా, ఇప్పటివరకు ఆయన 100కి పైగా వీడియోలు చేశాడు.