ప్రజావాణికి 17 ఫిర్యాదులు..ఫిర్యాదులను స్వీకరించిన డీఆర్వో

ప్రజావాణికి 17 ఫిర్యాదులు..ఫిర్యాదులను స్వీకరించిన డీఆర్వో
  • సమాచారం లేక తగ్గిన అప్లికేషన్లు

హైదరాబాద్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కారణంగా జిల్లా కలెక్టరేట్​లో 2 నెలలుగా రద్దయిన ప్రజావాణి  సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. హైదరాబాద్ కలెక్టరేట్​లో ప్రజావాణిని నిర్వహించగా.. కలెక్టర్​ అనుదీప్​ హాజరుకాలేదు. ఆయన ప్రజాభవన్​లో ప్రజాదర్బార్​కు వెళ్లారు. దీంతో డీఆర్వో వెంకటాచారి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

మొత్తం 17 ఫిర్యాదులు రాగా.. ఇందులో 11 హౌసింగ్,​ ఆసరా పెన్షన్​తదితర  ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు ముందస్తు సమాచారం లేకపోవడంతో ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీవో సూర్య ప్రకాశ్, సికింద్రాబాద్ ఆర్డీవో రవికుమార్, ప్లానింగ్​అధికారి సురేందర్, బీసీ వెల్ఫేర్ అధికారి ఆశన్న, ఎస్సీ కార్పొరేషన్ అధికారి యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లాలో ప్రజావాణికి 53 అర్జీలు

శామీర్ పేట : అంతాయిపల్లిలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 53 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తొందరగా పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్​లైన్​లో అప్ లోడ్ చేయాలన్నారు. అనంతరం అర్జీదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర రెడ్డి,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.