బార్డర్లో డ్రోన్స్, మిస్సైల్స్ వర్షం.. పంజాబ్, జమ్మూ - కశ్మీర్లో కంప్లీట్ బ్లాకౌట్

బార్డర్లో డ్రోన్స్, మిస్సైల్స్ వర్షం.. పంజాబ్, జమ్మూ - కశ్మీర్లో కంప్లీట్ బ్లాకౌట్

ఆపరేషన్ సిందూర్ ధాటికి విలవిల లాడిన పాకిస్తాన్.. ప్రతిచర్య తీసుకునేందుకు తెగబడింది. బుధవారం (మే 7) కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటైన సమాధానం ఇచ్చి.. గురువారం పాక్ లో పలు స్థావరాలు, నగరాలపై దాడులు చేసింది. దీంతో గురువారం (మే 8) సాయింత్రం 9 గంటల తర్వాత డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది పాక్. జమ్మూకశ్మీర్, పంజాబ్ లోని ఆర్మీ బేస్ క్యాంపులే లక్ష్యంగా దాడిని తీవ్రతరం చేసింది. 

సత్వారి, సాంబ, ఆర్ఎస్ పుర, ఎర్నియా సెక్టార్ లలో ఉన్న ఆర్మీ క్యాంపులే టార్గెట్ గా 8 మిస్సైల్స్ ను లాంచ్ చేసింది. దీంతో సరిహద్దు ప్రాంతాలు బాంబులు, సైరెన్ ల మోతమోగుతున్నాయి. పాకిస్తాన్ దాడిని తీవ్రతరం చేసిన తరుణంలో పంజాబ్, జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాలలో బ్లాకౌట్ అమలు చేసింది ఇండియన్ ఆర్మీ. అంటే పూర్తిగా కరెంటు ను నిలిపివేసి శత్రువులకు స్థావరాల కనపడకుండా చేయడమే బ్లాకౌట్. 

పఠాన్ కోట్ ప్రాంతంలో బాంబుల మోత వినిపింనట్లు స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ బయటకు రాకూడదని, ఇళ్లు, వీదుల్లోని అన్ని లైట్లను ఆర్పేసి చీకటిని మెయింటైన్ చేయాలని అధికారులు ఆదేశించారు. బుధవారం (మే 7) పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రర్ స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత పాక్ తీవ్రంగా ప్రతిస్పందించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా డ్రోన్స్, మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. దీనికి భారత ఆర్మీ ధీటుగా సమాధానం చెబుతోంది. 

►ALSO READ | పాకిస్తాన్కు మరో షాక్.. భారత్లో పాక్ ఓటీటీ కంటెంట్ బ్యాన్.. కేంద్రం ఆదేశం

భారత్‎పై ఆకస్మిక దాడులకు దిగిన పాకిస్థాన్‎కు బిగ్ షాక్ తగిలింది. పాక్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత్ కూల్చి వేసింది. ఒక ఎఫ్ 16 ఫైటర్ జెట్, రెండు JF-17 యుద్ధ విమానాలను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం చేసింది. వీటితో పాటు పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా భారత సైన్యం కూల్చివేసింది. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్ మరియు పఠాన్‌కోట్‌, జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు డ్రోన్‌లను వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. పాక్ ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది.