డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యుద్ధం చేస్తున్నడు

డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యుద్ధం చేస్తున్నడు

యుద్ధం చేయాలంటే తుపాకి పట్టాల్సిన పనిలేదు. పద్దెనిమిదేండ్లు నిండాల్సిన అవసరంలేదంటున్నాడు ఈ పదిహేనేండ్ల కుర్రాడు ఆండ్రి పోక్రాసా. కొంతకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టి పెరిగిన ఆండ్రి యుద్ధ భూమిలో డ్రోన్ ఎగరేస్తూ, వాళ్ల దేశ సైనికులకు సాయం చేస్తున్నాడు. ఆండ్రికి చిన్నప్పటి నుంచి డ్రోన్ ఎగరేస్తూ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ దేశ పౌరులు... దేశం కోసం తమకు తాముగా యుద్ధంలో పాల్గొనడం చూశాడు. ‘వాళ్లతో పాటు నేను కూడా వెళ్లి యుద్ధం చేస్తానంటే’ ఒప్పుకోలేదు ఆండ్రి తల్లిదండ్రులు. వాళ్లు వద్దన్నారని తనేం ఊరుకోలేదు. శత్రువులతో యుద్ధం చేయాలన్న కలను తనకున్న హాబీతో తీర్చుకోవాలనుకున్నాడు.  శత్రువుల యుద్ధ స్థావరాలను గుర్తించడానికి డ్రోన్ ఎగరేయడం మొదలుపెట్టాడు. వాళ్లు ఎక్కడున్నారు? ఏ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారన్న విషయాలన్నీ డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెట్టిన కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీసి ఉక్రెయిన్ ఆర్మీకి పంపిస్తున్నాడు. వాటి సాయంతో ఉక్రెయిన్ ఆర్మీ చాలాసార్లు రష్యాతో తలపడ గలిగింది. డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎవ్వరికీ కనిపించకుండా చెట్లచాటున, గుట్టల్లో ఉంచి ఎగరేస్తాడు ఆండ్రి. ఈ విషయం తెలిసి చాలామంది సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఆండ్రిని  తెగ మెచ్చుకుంటున్నారు.