రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రెండో మహిళా రాష్ట్రపతి కాగా.. తొలి గిరిజన రాష్ట్రపతి కావడం విశేషం.

రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకు ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్కు చేరుకున్న ద్రౌపది ముర్ముకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అక్కడ సైనిక వందనం స్వీకరించారు.