మెడికల్ షాపుల్లో డీసీఏ రైడ్స్ రూ.60వేల మెడిసిన్ సీజ్

మెడికల్ షాపుల్లో డీసీఏ రైడ్స్ రూ.60వేల మెడిసిన్ సీజ్

తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల పలు చోట్ల దాడులు నిర్వహించారు.  నకిలీ  ఔషధాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఆయా యజమానులపై చర్యలు తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లిలో  డ్రగ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులను సీజ్ చేశారు. జయశంకర్ భూపాల పల్లిలోని పలు మెడికల్ షాపుల్లో యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఉండాల్సిన ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధర ప్రింట్ చేసి అమ్ముతున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. ఎట్రాజో- 200 మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు.

లైఫ్ లైన్ మెడికల్ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఇలియాస్ అహ్మద్ దగ్గర 60వేల విలువైన మందులను సీజ్ చేశారు.హైదరాబాద్ శివరాంపల్లిలో ఫీవర్ తగ్గిస్తుందని అడ్వర్టైజ్ చేస్తూ.. అమ్ముతున్న అపెక్సోమోల్ ట్యాబ్లెట్స్ డిసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్యాబ్లెట్స్ జ్వరాన్ని తగ్గించవని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అఫీసర్స్ చెబుతున్నారు.