ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..?

ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..?

సంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తీరువల్లనే రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ వచ్చిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. మద్యం సేవించిన వారు దానికి బానిసై ఆడబిడ్డలపై మానభంగాలు చేసి హత్య చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో విజయశాంతి పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత తల్లి, చెల్లి అనే భేదం లేకుండా మానభంగాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల లవ్ జిహాద్ కొత్తగా వచ్చిందని, రాష్ట్రంలో మహిళలు సెక్యూరిటీ లేక బిక్కు బిక్కు మని జీవిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. ఇలాంటి  ముఖ్యమంత్రి కావాలా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అవసరమని ఆమె పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భద్రత లేని చోట మోడీ, యోగి భద్రత కల్పించారని, ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ మాఫియా చేతుల్లో లేదన్నారు. యూపీలో బీజేపీ రెండో సారి గెలిచింది అంటే మంచి పనులు చేయడం వల్లనేనని, అపవిత్రంగా వున్న రాష్ట్రాన్ని యోగి ప్రభుత్వం కడిగి పవిత్రం చేసిందన్నారు. 
తెలంగాణ  రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం లేదని, ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. తప్పులు చేసిన ప్రభుత్వం పాతాళం లోకి పోతుందన్నారు. ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నాడని, బీజేపీ నాలుగు రాష్ట్రాలు గెలిచిందనే భయంతో కేసీఆర్ ఆసుపత్రిలో పడుకున్నాడన్నారు. గత ఐదుఏళ్లలో ఇస్తానన్న పథకాలు ఏమి అమలు చేయలేదని.. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదున్నారు. రెండు వేలు, మూడు వేలు ఇచ్చి  మాయ చేయాలని చేస్తున్నాడని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మీ చేతుల్లోనే వుందన్నారు. మీకు చెప్పడం మా డ్యూటీ.. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం మీ డ్యూటీ.. మీరు బాగుండాలి అనే తపనే తప్ప... ఇందులో నా స్వార్థం ఏమీ లేదన్నారు విజయశాంతి. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువత ఓట్లతోనే గెలిచిందన్నారు. 

 

ఇవి కూడా చదవండి

అవినీతి లేకుండా డబ్బంతా పేదలకే ఖర్చు చేస్తాం

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించడానికే ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్