డ్రగ్స్ కేసులో ఫెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్..

 డ్రగ్స్ కేసులో ఫెడ్లర్  మస్తాన్ సాయి అరెస్ట్..

హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఫెడ్లర్ మస్తాన్ సాయిని ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్  మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది . గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసింది. జూన్ జూన్ 3న విజయవాడ రైల్వేస్టేషన్లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా సెబ్  పోలీసులు దాడులు చేశారు. పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయిపై నిఘా పెట్టిన పోలీసులు మస్తాన్ దర్గాలో తలదాచుకుండగా అరెస్ట్ చేశారు.

రాజ్ తరుణ్, లావణ్య కేసులోమస్తాన్ సాయి పేరు వినిపించింది.   అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్  చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.   మస్తాన్ సాయి మొబైల్ లో వీడియోలపై ఆరా తీస్తున్నారు పోలీసులు .  ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్ గా పెట్టుకుని మస్తాన్ సాయి మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు.