హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
  • ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి కొని హైదరాబాదులో ఎక్కువ ధరకు అమ్మకం

హైదరాబాద్: సులభంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ దందా మొదలుపెట్టిన ముఠా గుట్టు రట్టు అయింది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, మహంకాళి పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ గ్యాంగ్ పట్టుబడింది. నిందితుల వద్ద నుండి సుమారు 2 కిలోల గంజాయితోపాటు బరువు తూచే ఎలక్ట్రానిక్ యంత్రం.. నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు ముగ్గురిని ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. రథ్య మండల్, సుశాంత్ పత్ర అలియాస్ నంద,  కలంది అనే ముగ్గురు నిందితులు ఈజీగా డబ్బు సంపాదించడానికి డ్రగ్స్ దందాను ఎంచుకున్నారు. తమ స్వస్థలం ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొని.. హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మేసి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నారు. నిందితులందరూ సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ సమీపంలో గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.