బస్సుల్లో బెంగళూరు నుంచి డ్రగ్స్​ సప్లయ్

బస్సుల్లో బెంగళూరు నుంచి డ్రగ్స్​ సప్లయ్
  •     ఐదుగురు అరెస్ట్.. 12.72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం

మాదాపూర్, వెలుగు : బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్​బస్సుల్లో సిటీకి డ్రగ్స్​తెచ్చి విక్రయిస్తున్న పాతనేరస్థుడితోపాటు నలుగురు వ్యాపారులను టీఎన్​న్యాబ్​అధికారులు, మాదాపూర్​పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. 12.72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఒక సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్​ఇన్​స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరుకు చెందిన వెంకటసాయిచరణ్(25) బెంగుళూరులో చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడి జయానగర్​లోని టూరిస్ట్​ఆఫీసులో జాబ్​చేస్తున్నాడు.

వచ్చే జీతం సరిపోకపోవడంతో డ్రగ్స్​విక్రయించడం స్టార్ట్​చేశాడు. బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్స్​ను కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్​ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ప్రైవేట్​బస్సుల డ్రైవర్లతో పరిచయం పెంచుకుని డ్రగ్స్ సప్లయ్​చేస్తున్నాడు. ఈ నెల 21న సాయిచరణ్​ఓ ట్రావెల్స్​బస్సులో డ్రగ్స్​తీసుకువచ్చి, దుర్గం చెరువు వద్ద ఉన్న డాక్టర్స్​కాలనీలో కస్టమర్లకు అమ్ముతున్నాడనే సమాచారం అందుకున్న టీఎన్​న్యాబ్​అధికారులు మాదాపూర్​ పోలీసులతో కలిసి పట్టుకున్నారు.

డ్రగ్స్​ కొనుగోలు చేసిన మాదాపూర్​కు చెందిన లోకేశ్(25), సందీప్​రెడ్డి(30), కూకట్​పల్లికి చెందిన రాహుల్(30), సనత్​నగర్​కు చెందిన సుబ్రమణ్యం(25)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12.72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకొని మాదాపూర్​ పోలీసులకు అప్పగించారు. సాయిచరణ్​పై గతంలో ఎస్​ఆర్​నగర్​, చందానగర్​పోలీస్​ స్టేషన్లలో డ్రగ్స్​సప్లై చేసిన కేసులు ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్

నెల్లూరు సిటీలతో పాటు కర్ణాటక రాష్ర్టంలో 50 మంది కస్టమర్లకు రెగ్యూలర్​గా డ్రగ్స్​ను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్నింగ్ స్టార్, రాజేశ్వరి, జీవీఆర్, చెర్రి ట్రావెల్స్​బస్సుల్లో డ్రగ్స్​ ట్రాన్స్​పోర్ట్​ చేస్తున్నట్లు తెలిపారు. ట్రావెల్​ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినట్లు టీఎన్ న్యాబ్ అధికారులు వెల్లడించారు.