
హైదరాబాద్ లో డ్రగ్స్ దందా రోజు రోజుకీ పెరిగిపోతోంది. స్విగ్గీ డెలివరీ పేరుతో డ్రగ్స్ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయి సరఫరా చేస్తున్న బాలాజీ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలో ఎంఎస్ చేసిన బాలాజీ సింగ్.. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. కెనడాలో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. దూల్‌పేట్ డ్రగ్ పెడ్లర్‌తో బాలాజీ సింగ్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు బాలాజీ సింగ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.