షాకులిచ్చి.. మందు మాన్పించిన్రు

షాకులిచ్చి..  మందు మాన్పించిన్రు

కెనడా సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రీసెర్చ్ సక్సెస్ 
 ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’తో మెదడుకు షాకులు

ఆయనొక సైంటిస్ట్. రోజూ ఫుల్ బాటిల్ విస్కీ ఖతం చేసేదాకా పడుకునేటోడు కాదు. తాగీతాగీ 2012లో లివర్ చెడిపోయింది. కొత్త లివర్ తెప్పించి, ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నడు. కానీ తాగుడు తగ్గించలేకపోయిండు. కొత్త లివర్ కూడా చెడిపోయింది. ఇక మందు మానకుంటే చావు తప్పదని డాక్టర్లు తేల్చిండ్రు. పనిలో పనిగా ఓ కొత్త రీసెర్చ్ జరుగుతోందని, అందులో పార్టిసిపేట్ చేస్తారా? అని అడిగారు. ఆయన ఓకే అన్నడు.. ఇంకేం.. రీసెర్చ్ లో భాగంగా ఆయన మెదడుకు షాకుల మీద షాకులిచ్చిన్రు. కొన్ని రోజులకు ఆయనకు మందు తాగాలన్న కోరికే తగ్గిపోయింది!

ఏం చేశారంటే..

అరవై ఏడేళ్ల డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్ కెనడాలోని నేషనల్ మైక్రోబయలాజీ ల్యాబ్ మాజీ డైరెక్టర్. మందుకు బానిసైపోయి, ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో టొరంటోలోని సన్నీబ్రూక్ హెల్త్ సైన్సెస్ సెంటర్ డాక్టర్లు ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ అనే ట్రీట్ మెంట్ గురించి చెప్పారు. ఆయన ఒప్పుకునేసరికి మెదడులో రెండు ఎలక్ట్రోడ్లు అమర్చారు. అవి పనిచేసేందుకు అవసరమైన పవర్ అందించేందుకు ఒక బ్యాటరీని భుజం వద్ద కాలర్ బోన్ కింద అమర్చారు. ఆయనకు మందు తాగాలన్న కోరిక తీవ్రం అయినప్పుడల్లా ఎలక్ట్రోడ్ల నుంచి మెదడుకు షాక్ కొట్టేలా చేశారు. ఇలా కొన్ని రోజుల పాటు ఎలక్ట్రోడ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిన షాకుల వల్ల ఆయన మెదడులో మందు తాగాలన్న కోరిక క్రమంగా తగ్గిపోయిందని సైంటిస్టులు వెల్లడించారు. ఇప్పటివరకూ హెరాయిన్, ఓపియాయిడ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడినోళ్లకు మాత్రమే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నిక్ ద్వారా ట్రీట్ మెంట్ విజయవంతంగా చేశారట. మద్యం అలవాటు మాన్పించేందుకు ఈ టెక్నిక్‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా వాడటం ఇదే మొదటిసారని చెప్తున్నారు.