468 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ధ్వంసం

468 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ధ్వంసం

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్​పోర్టులో ఈ ఏడాది భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కస్టమ్స్‌‌‌‌‌‌‌‌, డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ ఇంటెలీజెన్స్(డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) జాయింట్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌లో మొత్తం రూ.468.02 కోట్లు విలువ చేసే 216.69 కిలోల డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, రూ.40 లక్షలు విలువ చేసే ఫారెన్ సిగరెట్స్‌‌‌‌‌‌‌‌ సీజ్ చేశారు. వీటిని మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌‌‌‌‌‌‌‌లోని వేస్ట్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ధ్వంసం చేశారు. 

వివరాలను హైదరాబాద్ జోన్ కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు మంగళవారం వెల్లడించారు. నైజీరియా, బెనియోనోయిస్, టాంజానియన్, సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి హెరాయిన్‌‌‌‌‌‌‌‌, మెఫడ్రోన్‌‌‌‌‌‌‌‌, గంజాయి, ఫారిన్ సిగరేట్స్‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేశారు. వీటిని అంతర్జాతీయ విమానాల్లో శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు తీసుకొచ్చి, ఇక్కడి నుంచి  ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

ఇలాంటి స్మగ్లింగ్ గ్యాంగ్స్‌‌‌‌‌‌‌‌పై డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు నిరంతర నిఘా పెట్టారు. డ్రగ్స్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టర్లను అరెస్ట్ చేసి రూ. కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతితో వాటిని ధ్వంసం చేశారు.