డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ సెలబ్రిటీలకు క్లీన్‌‌‌‌‌‌‌‌ చిట్‌‌‌‌‌‌‌‌

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ సెలబ్రిటీలకు క్లీన్‌‌‌‌‌‌‌‌ చిట్‌‌‌‌‌‌‌‌
  • బలమైన సాక్ష్యాలు లేవని కోర్టులో ఎక్సైజ్​ సిట్ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్|
  •  కెల్విన్ కాల్‌‌‌‌‌‌‌‌డేటా ఆధారంగా విచారించామని వెల్లడి
  •  గతేడాది డిసెంబర్​28 నాటి చార్జ్​షీట్
  • ​తాజాగా బయటకు  సిట్‌‌‌‌‌‌‌‌ రిపోర్టుల ఆధారంగా 
  • ఈడీ దర్యాప్తు.. రేపు ఈడీ విచారణకు తరుణ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో సెలబ్రిటీలకు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ సిట్‌‌‌‌‌‌‌‌ క్లీన్ చిట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. కెల్విన్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందాలో పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్​ ప్రీత్​ సింగ్, రానా, నవదీప్​, తనీశ్, ముమైత్​ ఖాన్​, నందు, తరుణ్, రవితేజ, ఆయన డ్రైవరు, ఎఫ్​ క్లబ్​ మేనేజర్ కు సంబంధాలేం లేవని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కోర్టులో సిట్‌ఫైల్‌‌‌‌‌‌‌‌ చేసిన చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ తాజాగా బయటకు వచ్చింది. సెలబ్రిటీలను బాధితులుగా, సాక్షులుగా చేర్చేందుకు బలమైన ఆధారాల్లేవని కోర్టుకు సిట్​తెలిపింది. పూరీ జగన్నాథ్‌‌‌‌‌‌‌‌, యాక్టర్​తరుణ్‌‌‌‌‌‌‌‌ నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్స్​ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ రిపోర్టును కోర్టుకు అందించింది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్టు ఆధారాలేం దొరకలేదని తెలిపింది. ప్రధాన నిందితుడు కెల్విన్‌‌‌‌‌‌‌‌ (28), డ్రగ్స్ పెడ్లర్లు వలిగెడ్డె నిఖిల్‌‌‌‌‌‌‌‌ షెట్టి (33), వీరగండ రవికిరణ్‌‌‌‌‌‌‌‌ (34)ల దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామంది. ఈడీ దర్యాప్తు.. రేవంత్, కేటీఆర్​ మధ్య డ్రగ్స్​ వార్ జరుగుతున్న టైమ్​లో సిట్​ చార్జ్​షీట్​ బయటకు రావడం చర్చనీయాంశమైంది.   
విదేశాల నుంచి డ్రగ్స్
కెల్విన్ దగ్గర సీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్స్, సిమ్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌, పెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్స్‌‌‌‌‌‌‌‌, మెయిల్స్‌‌‌‌‌‌‌‌ డేటాను సిట్‌‌‌‌‌‌‌‌ రికవరీ చేసింది. డార్క్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్స్, వాట్సాప్, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ లాంటి సోషల్‌‌‌‌‌‌‌‌మీడియా ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌పై కోడ్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్​లో అతను డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా చేస్తున్నట్లు గుర్తించింది. ఫారిన్‌‌‌‌‌‌‌‌ కంట్రీస్‌‌‌‌‌‌‌‌ నుంచి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కొంటున్నట్టు ఆధారాలు సేకరించింది. మంగళూరు‌‌‌‌‌‌‌‌లో చదువుకున్న రోజుల్లోనే డ్రగ్స్ సప్లయ్ ప్లాన్ చేసినట్లు గుర్తించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మ్యుజీషియన్‌‌‌‌‌‌‌‌, ఈవెంట్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నట్లు కనుగొంది. కెల్విన్ డిలీట్‌‌‌‌‌‌‌‌ చేసిన డేటాను రికవరీ చేసింది. ఫోన్ నంబర్స్, వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా కెల్విన్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించింది.ఈ మెయిల్స్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ తీసుకునేవాడని గుర్తించింది.

పూరీ జగన్నాథ్‌‌‌‌‌‌‌‌, తరుణ్ శాంపిల్స్ నెగిటివ్‌
కెల్విన్ కాల్‌‌‌‌‌‌‌‌డేటా, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ చాటింగ్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సినిమా యాక్టర్లు,సెలబ్రిటీలు, స్టూడెంట్లు, హోటళ్లు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయిస్‌‌‌‌‌‌‌‌, ఈవెంట్‌‌‌‌‌‌‌‌ మేనేజర్లకు సంబంధించిన ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లను సిట్​ కలెక్ట్ చేసింది. ఫోన్ నంబర్స్, మనీ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా 12 మంది సెలబ్రిటీలతో పాటు మొత్తం 62 మందికి ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నోటీసులిచ్చింది. సుమారు 2 నెలలు 
విచారించింది. విచారణకు హాజరైన సెలబ్రిటీల్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌‌‌‌‌‌‌‌, యాక్టర్​‌‌‌‌‌‌‌‌ తరుణ్ మాత్రమే శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. వీరి శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌కి పంపారు. నెగెటివ్ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌ను కోర్టుకు అందించారు. ఇదే కేసులో టాలీవుడ్​కు సంబంధించిన 12 మంది సెలబ్రిటీలు ఈడీ విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఈడీ ముందు హీరో తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.

ఇంతకాలం బయటకురాని చార్జ్ షీట్
టాలీవుడ్ లో సంచలనం రేపిన కెల్విన్ డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన చార్జ్​షీట్..​ 9 నెలల తర్వాత బయటకు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా, మనీ ల్యాండరింగ్ పై ఈడీ కేసు నమోదు చేసి 12 మంది సెలబ్రిటీలను విచారిస్తుండటం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య డ్రగ్స్ వార్ డిఫమేషన్​ వరకు వెళ్లిన టైమ్​లో చార్జ్ షీట్​ బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఆర్టీఐ కింద వివరాలు అడిగిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు 4 చార్జ్ షీట్స్ ఫైల్ చేసినట్లు సిట్ తెలిపింది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది.