డ్రంకన్ డ్రైవ్లో మందు బాబుల హల్చల్

డ్రంకన్ డ్రైవ్లో మందు బాబుల హల్చల్

ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోపిగా మారింది. ఇటీవలే మలక్పేట్ పోలీసులకు చుక్కలు చూపిన ఓ దివ్యాంగుడు ఘటన మరువక ముందే.. పాతబస్తీ మీర్ చౌక్ లో మరో మందు బాబులు హల్ చల్ చేశాడు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒ వ్యక్తినీ పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆ మందుబాబు పోలీసులతో వాగ్వివాధానికి దిగాడు. పోలీసుల ఎదుటే ప్యాంట్ విప్పి హల్ చల్ చేశాడు. తనను పోలీసులు ప్యాంట్ విప్పి కొట్టారని నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. అయితే ఆ మందు బాబుకు ట్రాఫిక్ పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో చివరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారి కుటుంబం సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు.