ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఓ యువతి కూడా ఉందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి కారు నడపారని అన్నారు. కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మితిమీరిన వేగంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. కారులో ఇరుక్కున్న యువతిని అతి కష్టం మీద బయటకు తీశారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి:

వచ్చేనెల 3 నుంచి టీనేజర్లకు టీకా

నుమాయిష్​పై హైకోర్టులో విచారణ