- రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు, జైలు, వెహికల్ సీజ్
- మందుబాబులపై సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల కొరడా
సిద్దిపేట, వెలుగు : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై సిద్దిపేట పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు ఫైన్, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేయనుండగా, రెండోసారి కూడా దొరికితే రూ.15 వేల ఫైన్, జైలు శిక్ష పడడంతో పాటు వెహికల్‌ను సీజ్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత రెండు రోజుల్లో 22 మంది మందుబాబులను గుర్తించి రూ.2.20 లక్షల జరిమానా విధించారు. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ సోమవారం వివిధ ప్రాంతాల్లో డ్రంకన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించి ఏడుగురికి రూ.10 వేల చొప్పున, మంగళవారం వన్ టౌన్ పరిధిలో ముగ్గురికి రూ.30 వేలు, త్రీ టౌన్ పరిధిలో 12 మందికి రూ.1.20 లక్షల జరిమానా విధించారు. జిల్లాలోని వివిధ రోడ్లపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మందుబాబులపై భారీగా జరిమానాలు వేస్తున్నారు.
