వీడి ఐడియాకు ఫిదా.. : డ్రంకన్ అండ్ డ్రైవ్ లో దొరక్కుండా ఎద్దుపై స్వారీ

వీడి ఐడియాకు ఫిదా.. : డ్రంకన్ అండ్ డ్రైవ్ లో దొరక్కుండా ఎద్దుపై స్వారీ

తాగండి రా బాబూ తాగండి అని గల్లీ గల్లీలో వైన్ షాపులు పెడతారు.. తాగిన తర్వాత గల్లీ చివర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు.. పోలీసులు పట్టుకుంటున్నారని మందు ప్రియులు ఏమైనా ఆగుతారా ఏంటీ.. సమస్యే లేదు.. తాగాల్సిందే కదా. ఇదే విధంగా ఫుల్ గా మందుకొట్టిన ఓ వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వైవిధ్యంగా ఆలోచించాడు. బైక్, కారులో వెళితే కదా పోలీసులు పట్టుకునేది.. అదే ఎద్దుపై వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు.. ఆలోచనను వెంటనే అమల్లో పెట్టేశాడు.. ఎద్దుపై స్వారీ చేస్తూ.. పోలీసుల ముందే దర్జాగా వెళ్లిపోయాడు.. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు ఎలా కేసు పెట్టారు.. అసలు కేసు పెట్టొచ్చా లేదా అనేది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.. ఆ డీటెయిల్స్ను తెలుసుకుందామా...


ఉత్తరాఖండ్ లో మందేసి ఎద్దుపై వీరంగం సృష్టించాడో యువకుడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల్లో హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.  రాత్రిపూట వీధుల్లో ఎద్దుపై స్వారీ చేస్తుంటే అక్కడక్కడ జనాలు బెంబేలెత్తారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్  తపోవన్ ఏరియాలో జరిగింది. 

ఈ వీడియో పోలీసులకు దృష్టికి రావడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని తపోవన్‌లో ఎద్దుపై ఓ యువకుడు స్వారీ చేశాడని వివరించారు. మే 5వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఎద్దుపై స్వారీ చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. మళ్లీ జంతువులతో క్రూరంగా వ్యవహరించరాదని హెచ్చరించారు.