
తిరుపతిలో మందుబాబులు హల్చల్ చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు మందుబాబులు. తిరుపతిలోని ఎస్టీ నగర్ దగ్గర ఉన్న విక్టరీ వైన్స్ ముందు ఓ యువకుడు కత్తులతో హడావిడి చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మద్యం మత్తులో చేతిలో కత్తితో హల్చల్ చేశాడు యువకుడు.
ఈ ఘటనతో భయబ్రాంతులకు గురయ్యారు స్థానికులు. ఇటీవల కాలంలో తిరుపతిలో మందుబాబుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం మత్తులో రోడ్లపై హల్చల్ చేస్తున్నారని అంటున్నారు స్థానికులు.
ALSO READ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి
మద్యానికి బానిసలైన యువకులు తిరుపతిలో భయానక పరిస్తుతులు క్రియేట్ చేస్తున్నారని.. గత కొంతకాలంగా యువత కత్తులు పట్టుకొని తిరుగుతున్నారని అంటున్నారు స్థానికులు. చిన్న చిన్న విషయాలకే కత్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఇలాంటివారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానికులు.