మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు

మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు

నేరెడ్‌మెట్, వెలుగు: మద్యం మత్తులో ఓ వ్యక్తి బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన నేరెడ్‌మెట్ పీఎస్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ ఏరియాలో ఉండే సాయికుమార్ (32) బుధవారం సాయంత్రం 5 గంటలకు కృపా కాంప్లెక్స్ దగ్గరున్న పాన్ షాప్ వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో అక్కడ బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. దీన్ని గమనించిన స్థా నికులు వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నేరెడ్‌మెట్ పోలీసులు సాయి కుమార్‌ను ట్రీట్‌మెంట్ కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.