ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా.. 14 వేల మంది పురుషులకు మహిళల స్కీమ్ డబ్బులు..

ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా.. 14 వేల మంది పురుషులకు మహిళల స్కీమ్ డబ్బులు..

మహిళా స్కీమ్స్ ఎక్కడైన పురుషులకు అమలవుతాయా..? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 14 వేల మంది అకౌంట్లలో నెల నెలా స్కీమ్ డబ్బులు జమ కావటం ఏంటి..? ఇప్పుడు మహారాష్ట్ర ఈ ఇష్యూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు ఈ స్కీమ్ ద్వారా పురుషులకు కూడా డబ్బులు పంపించి భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శానాస్ర్తాలు సంధిస్తున్నాయి. 

మహరాష్ట్రలో 2024 ఎన్నికలకు సరిగ్గా ఒక నెల ముందు హడావుడిగా తీసుకొచ్చిన లడ్కీ బహిన్ యోజన ద్వారా భారీ అవినీతి జరిగిందని ప్రతపక్షాలు ఆరోపిస్తున్నాయి. శివసేన, బీజేపీ, ఎన్సీపీ మహాయుతి కూటమి గెలిచేందుకు ఈ డబ్బుల పంపిణీ స్కీమే కారణం అని విమర్శిస్తున్నాయి. లడికీ బహిన్ యోజన పథకం కింద 21 నుంచి 65 ఏళ్ల మహిళలకు నెలకు 15 వందల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద ప్రతి ఫ్యామిలీ ఏడాదికి రెండున్నర లక్షల రూపాయలు లబ్దిపొందుతుంది. 

14 వేల మందికి రూ.21 కోట్లు:

మహిళా, శిశు అభివృద్ధి శాఖ (WCD) చేపట్టిన ఆడిట్ లో మొత్తం 14,298 మందికి 21 కోట్ల 44 లక్షలు పంపిణీ చేసినట్లు తేలింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లో మహిళలుగా పేర్లు మార్చుకుని పథకానికి లబ్దిదారులుగా మారినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఈ స్కీమ్ లాంచ్ చేసి 10 నెలలు గడిచిన తర్వాత అవినీతి బయటపడింది. 

►ALSO READ | TCS ఉద్యోగులకు బిగ్ షాక్.. త్వరలో 12 వేల మందిని తొలగించే ప్లాన్ !

ఈ స్కీమ్ ద్వారా జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రసిడెంట్ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ఓటర్లను ఆకర్శించి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అనర్హులకు.. అందులో పురుషులకు స్కీమ్ వచ్చేలా చేసి అతిపెద్ద ఫ్రాడ్ కు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపైకి CBI, ED లను ఉసిగొల్పే ప్రభుత్వం.. ఇంత పెద్ద అవితీనిపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఈ వివాదంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. ఈ స్కీమ్ లో పురుషులను చేర్చడంలో ఎలాంటి అర్థం లేదు. ఒకవేళ అలాంటి పొరపాట్లు జరిగి ఉంటే డబ్బును రికవర్ చేసుకుంటామని తెలిపారు.