
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పాదం గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ చేసే క్రమంలో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. అట కొనసాగించలేకపోవడంతో మైదానాన్ని వీడాడు. తర్వాత రోజు పంత్ గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు. గాయంలోనూ పంత్ పోరాటం ప్రతి ఒక్కరి ప్రశంసలకు కారణమైంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో కూడా పంత్ జట్టు కోసం బ్యాటింగ్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా డ్రా కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే పంత్ బ్యాటింగ్ చేయడం కీలకంగా మారే అవకాశం ఉంది. జట్టుకు ఒకవేళ తన బ్యాటింగ్ అవసరం ఉందనుకుంటే పంత్ బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మాంచెస్టర్ టెస్ట్ చివరి రోజున రిషబ్ పంత్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు క్రచెస్‌పై వచ్చాడు. చేతి కర్రల సహాయంతో స్టేడియానికి రావడంతో పంత్ బ్యాటింగ్ చేస్తాడో లేదో చూడాలి. పంత్ క్రచెస్ సహాయంతో స్టేడియానికి రావడం అతని డెడికేషన్ కు నిదర్శం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
►ALSO READ | WCL 2025: డివిలియర్స్ మరోసారి విధ్వంసం.. ఈ సారి 39 బంతుల్లోనే సెంచరీ
పంత్ ఐదో రోజు బ్యాటింగ్ చేస్తాడని కన్ఫర్మ్ చేశాడు. 4వ రోజు తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ పంత్ అందుబాటులో ఉన్నాడని ధృవీకరించాడు. పంత్ గాయపడడంతో అతని స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ కు బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. దీంతో జట్టు కోసం ఖచ్చితంగా బ్యాటింగ్ కు రావాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసి డ్రా కోసం పోరాడుతోంది. జడేజా (33), సుందర్ (39) క్రీజ్ లో ఉన్నారు.
Rishabh Pant has arrived at Old Trafford, Manchester, on Day 5. 🙇#Cricket #Pant #India #Sportskeeda pic.twitter.com/nUihDP8ouK
— Sportskeeda (@Sportskeeda) July 27, 2025