పెద్దాయనను ఎంత కష్ట పెట్టారే: మందు, సారా తాగనని దేవుడి సాక్షిగా ప్రమాణం

పెద్దాయనను ఎంత కష్ట పెట్టారే: మందు, సారా తాగనని దేవుడి సాక్షిగా ప్రమాణం

ఈరోజుల్లో మందు తాగని వారు ఎవరుంటారు చెప్పండి. ఖగోళ విశ్వంలో నక్షత్రాల్లో అక్కడక్కడా అలాంటి మహానుభావులు ఉంటారే తప్ప, మిగిలిన వారందరూ మందుబాబులే. కాస్త టైం దొరికిందా.. ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారా.. సిట్టింగ్ వేయాల్సిందే. బాటిల్ ఖాళీ అవ్వాల్సిందే. ఇదే ఇప్పటి ట్రెండ్. అందునా మందు తాగను అని ఎవరైనా అంటే వారిని గాడిదకంటే హీనంగా చూస్తారు. అలాంటి ఈరోజుల్లో ఓ పెద్దాయనను మందు తాగొద్దని కొందరు కష్ట పెట్టారు.

మందు మానేయమని ఎంతమంది చెప్పినా ఓ పెద్దాయన చెవికెక్కలేదట. సాయంత్రం అయ్యిందా! నాలుగు పెగ్గులు వేసి ఊగుతూ ఊరంతా తిరగడమే చేస్తున్నాడట. తాగొద్దని ఇంట్లో వారు అరిస్తే.. తాగనని చెప్పటం.. వారి కంట పడకుండా పని కానించటం ఇదే అతని దిన చర్య. ఇక లాభం లేదనుకున్న కుటుంబసభ్యులు అతని చేత బలవంతంగా దేవుని మీద ప్రమాణం చేయించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వీడియో ఉన్న దృశ్యాలను, వ్యక్తులను బట్టి ఇది తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఘటనే అని చెప్పొచ్చు. మత్తులో ఉండగానే అతని చేత ప్రమాణం చేయించారు. తాను చెప్పినట్లే చెప్పాలని పక్కనున్న వ్యక్తి అరుస్తుండగా.. సదరు మందుబాబు పదాలను సైతం స్పష్టంగా పలకలేకపోతున్నారు. మీరు కూడా ఈ దృశ్యాలను తిలకించి.. మీకు తెలిసిన నలుగురు మందుబాబులకు చూపించండి.