
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డ్రై క్లీనింగ్ షాపు పూర్తిగా దగ్ధమైంది. ఇవాళ తెల్లవారు జామున గాంధీ నగర్ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఎలక్ట్రిక్ డ్రై క్లినిక్ షాపు లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
గాంధీ నగర్ కాలనీలో గత ఐదు సంవత్సరాలుగా డ్రై క్లినిక్ షాపు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్. షాపులో విలువైన పట్టుచీరలతో పాటు ఇతర రకాల బట్టలు ఉండటంతో ..దాదాపు రూ.13 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
తెల్లవారు జామున షాపులో మంటలు రావడంతో కొందరు స్థానికులు ఫైర్, పోలీసు లకు సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.