కీసర ORR పై ఘోర రోడ్డుప్రమాదం..చెట్లకు నీరు పోస్తున్న కార్మికులను ఢీకొట్టిన వాహనం

కీసర ORR పై ఘోర రోడ్డుప్రమాదం..చెట్లకు నీరు పోస్తున్న కార్మికులను ఢీకొట్టిన వాహనం

మేడ్చల్: కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం(ఆగస్టు 11) ఓఆర్ ఆర్ పై చెట్లకు నీరు పోస్తున్న కార్మికులపైకి టాటా ఇంట్రో వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ, చెక్ మోహన్, జయరాం అనే ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. 

మృతి చెందిన కార్మికులు ఆగస్టు నెల 2వ తేదీన ఐటర్ రింగ్ రోడ్డుపై మొక్కలు నాటే పనిలో భాగంగా హైదరాబాద్  కు వచ్చారు. ఘాట్ కేసర్ నుంచి  శామీర్పేట్ వైపు వెళ్తున్న టాటా ఇంట్రో వాహనం అదుపు తప్పి కార్మికులను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుల స్వస్థలం ఒడిశాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.