వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!

వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. విపరీతంగా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఆకాశం మేఘాకృతమై చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. అయితే ఆ వర్షాలకు ఈ వారంలో బ్రేక్ పడనుందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ అంచనా తెలిపింది. రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కు చేరుతాయని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతవరణ అంచనాలను ప్రకటించింది. దీంతో నిన్న మొన్నటి దాకా చిన్న పాటి జల్లుతో వచ్చిన ఉపశమనానికి ఇక గుడ్ బై అన్నట్టే..

సోమవారం(నిన్నటి) నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైయ్యాయి. దీంతో మళ్లీ ఎప్పటిలాగే వేసవి తీవ్రత పెరుగుతుందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ అంచనా వేసింది. గత వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. వచ్చే వారం రోజుల్లో మళ్లీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు పుంజుకుంటాయని ప్రకటించింది.

 ఏప్రిల్ 22న  హైదారాబాద్ లోని ఖాజాగూడలో 42.9, బన్సీలాల్ పేటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని టిక్యా తండాలో 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. కాగా మంగళవారం (ఈరోజు) ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల,నిజామాబాద్, జగిత్యాల,నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో ఈరోజు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.