అడ్డదారిలో ప్రమోషన్ కొట్టిండు.. ప్రణీత్ రావుపై డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు

అడ్డదారిలో ప్రమోషన్ కొట్టిండు..  ప్రణీత్ రావుపై డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో నలుగురు అధికారులు అడ్డదారిలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందినట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు.  నలుగురు అధికారులల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు పేరు కూడా ఉంది.  గతంలో మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చేవారు. కానీ ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేయలేదు అయినప్పటికీ కూడా అడ్డదారిలో డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని గంగాధర్ ఫిర్యాదులో తెలిపారు.  గత ప్రభుత్వం తమకు కావలసిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ ఇచ్చిందంటూ గంగాధర్ తన ఫిర్యాదులో  ఆరోపించారు.  నలుగురు అధికారుల ప్రమోషన్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గంగాధర్.