- డీఎస్పీ ప్రసన్నకుమార్
టేక్మాల్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. టేక్మాల్ మండల పరిధిలోని పాల్వంచ గ్రామంలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వాహనాలను, వాటికి సంబంధించిన పేపర్లను తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా, బెట్టింగ్ వంటి నేరాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంటుందన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అల్లాదుర్గం, మెదక్ సీఐలు రేణుక రెడ్డి, జార్జ్, ఎస్ఐలు రాజేశ్, సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి, పోచయ్య, శ్రీనివాస్ గౌడ్, మల్లికార్జున్, క్యూఆర్టీ టీం సిబ్బంది పాల్గొన్నారు.
