రూ. కోటిన్నర బిల్లు మాఫీ చేసి.. విమాన టిక్కెట్లు కొనిచ్చి మరీ..

రూ. కోటిన్నర బిల్లు మాఫీ చేసి.. విమాన టిక్కెట్లు కొనిచ్చి మరీ..

రూ. కోటిన్నర ఆస్పత్రి బిల్లు మాఫీ

దుబాయ్ ఆస్పత్రి ఔదార్యం

దుబాయిలో హాస్పిటల్ మేనేజ్ మెంట్ మానవత్వం

దాతల సహకారంతో జగిత్యాలకు చేరిన వలస కార్మికుడు

జగిత్యాల, వెలుగు: దేశం కాని దేశంలో కరోనా బారిన పడ్డాడు. జతకడమే కష్టంగా ఉన్న అతని ట్రీట్మెంట్కు కోటిన్నర బిల్లయ్యింది. అక్కడ ఉన్న కొందరు స్వచ్చంద సేవకుల సహకారం, కాన్సులేట్ అధికారుల చొరవతో దుబాయ్లోని ఆస్పత్రి యాజమాన్యం కోటిన్నర బిల్లును మాఫీ చేసి మానవత్వాన్ని చాటుకుంది. దీంతో జగిత్యాల జిల్లాకు చెందిన గల్ఫ్ కార్మికులు రాజేశ్ క్షేమంగా ఇంటికి చేరాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాల రాజేశ్ (42) దుబాయిలో ఏప్రిల్ 23న కరోనా బారిన పడి, దుబాయిలోని రషీద్ ఆస్పత్రిలో చేరాడు. 80 రోజుల పాటు ట్రీట్ మెంట్చేసిన ఆస్పత్రి యాజమాన్యం దాదాపు 7 లక్షల 62 వేల దిరమ్స్ బిల్లు వేసింది. ఇండియా కరెన్సీలో అది రూ. కోటీ 52 లక్షలకు సమానం. బతుకుదెరువుకోసం వెళ్లిన వలస కార్మికుడు రాజేశ్ బిల్లు చూసి ఆందోళనకు గురయ్యాడు. ఈవిషయాన్ని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నరసింహ స్వామినారాయణ్.. దేవాలయ కమిటీ సభ్యులు అశోక్ కొటేచా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇండియన్ కాన్సులేట్ లేబర్ అధికారి హర్జీత్ సింగ్ ని సంప్రదించారు. రాజేశ్ ఆర్ధికపరిస్థితిని వివరిస్తూ బిలు మాఫీ చేయాలని ఆస్పత్రి మేనేజిమెంట్కు హర్జీత్సింగ్ లెటర్ రాశారు. సానుకూలంగా స్పందించిన ఆస్పత్రి వారు డబ్బులు తీసుకోకుండానే పేషేంటు ను డిశ్చార్జి చేశారు. రాజేశ్తో పాటు అతని సహాయకుడు ద్యావర కనుకయ్య లకు అశోక్ కొటేచా విమాన టికెట్లు, రూ.10 వేలు ఇచ్చి మంగళవారం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ కు పంపించారు. హోం క్వారెంటైన్ కు అనుమతిఇచ్చిన అధికారులు అతన్ని స్వగ్రామానికి పంపించారు.

For More News..

కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు

వట్టి డిగ్రీలతో లాభం లేదు