సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు దుబ్బాక పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కౌన్సిలర్ గా పోటీ చేయాలని ఆశించి పార్టీ టికెట్ కోసం పది రోజుల కింద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని సంప్రదిస్తే ఆయన అంగీకరించి గ్రౌండ్ వర్క్ చేసుకోమని చెప్పారని వివరించారు.
ఎమ్మెల్యే సూచన మేరకు నామినేషన్ వేసినా రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో టికెట్ తనకు కాకుండా ఎన్నడు పార్టీలో పనిచేయని ఓ వ్యక్తికి ఇవ్వాలనే ప్రయత్నాలను చూసి బాధకలిగిందన్నారు.
