కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదు

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదు

చండూరు, వెలుగు: రాష్ట్రంలో బైపోల్‌‌ ఎక్కడ వచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చండూరు మండలం గట్టుప్పల్​లో పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి నిజాయతీగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు.

పోయినసారి ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి 13 వేల ఓట్లు వచ్చాయని, ఈసారి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వేదాంతం గోపినాధ్, పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ భవానీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మాదగోని నరేందర్ గౌడ్, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ పులకరం సైదులు తదితరులు పాల్గొ