
అంతరిక్షంపై మానవుడు కాలుపెడుతున్న ఈ టెక్నాలజీ యుగంలో కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందనడానికి నిదర్శనమే ఈ ఘటన. తమిళనాడులోని కడలూరు జిల్లా తిర్కుతిట్టాయ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
తిర్కుతిట్టాయ్ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ ఊరి దళితవర్గానికి చెందిన మహిళా ప్రెసిడెంట్ ను పక్కన పెట్టేసి, ఉపాధ్యక్షుడు సారథ్యం వహించాడు. సభ్యులందరూ కుర్చీల్లో కూర్చోగా ప్రెసిడెంట్ కింద కూర్చుండిపోయింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రెసిండెంట్ గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం దాటినా గ్రామంలో వివక్ష ఎదుర్కొన్నట్లు తెలిపింది. అందరికి అనుకూలంగానే ఉన్నా నన్ను పక్కన పెడుతున్నారు, అవమానిస్తున్నారుని బాధితురాలు వాపోయింది. గ్రామ కార్యదర్శి ఈ వివక్షపై తమకు సమాచారం అందలేదని , అతన్ని వెంటనే సస్పెండ్ చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు