
ఇల్లెందు,వెలుగు: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని బుగ్గవాగు ప్రమాద స్థాయిలో ప్రవహించింది. వాగును ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను అధికారులు పునారవాస కేంద్రాలకు తరలించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు.