కడెం ప్రాజెక్టుకు వరద.. ఒక్క గేటు ఓపెన్

కడెం ప్రాజెక్టుకు వరద.. ఒక్క గేటు ఓపెన్
  •    ప్రాణహిత, ఇంద్రావతి పరవళ్లు 
  •     గోదావరిలో పెరిగిన వరద ఉధృతి 

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో దిగువన గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ఒక్క గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. గురువారం ఉదయానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీకి కూడా వరద పెరుగుతున్నది. కృష్ణా బేసిన్​లో ఆల్మట్టి, తుంగభద్ర రిజర్వాయర్లకు కొంతమేర వరద వస్తున్నది. మహాబలేశ్వర్​ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రానున్న రోజుల్లో కృష్ణా ప్రాజెక్టులకు వరద పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వరద మొత్తం దిగువనే ఉండటంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు పెద్దగా ఇన్​ఫ్లోలు లేవు.