
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పశువులు ఢీకొంటున్న ఘటనలు పెరుగుతుండటంతో రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తున్న మార్గాల్లో పట్టాలకు ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేస్తోంది. ముంబై, అహ్మదాబాద్ మార్గంలో 622 కిలోమీటర్ల మేర ఇప్పటికే కంచె ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. రూ.245.26 కోట్లతో చేపడుతున్న ఈ పనులు మే చివరినాటికి పూర్తవుతాయని రైల్వేశాఖ తెలిపింది. మిగతా రూట్లలోనూ కంచె ఏర్పాటు చేసే అవకాశం ఉంది.